దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సంయుక్త నిర్మాణంలో, శిరీష్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం "బలగం". వేణు యెలదండి దర్శకత్వంలో ఫీల్ గుడ్ విలేజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి బలరామ నరసయ్యో .. అని సాగే ఎమోషనల్ లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ పాటను దర్శకుడు వేణు టిల్లుతో కలిసి భీమ్స్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.