ఈ నెల 17న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషలలో విడుదల కావలసిన "ధమ్కీ" మూవీ చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ హీరోగా కూడా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా యొక్క నైజాం హక్కులు 4 కోట్ల భారీ డీల్ కి ముగిశాయని తెలుస్తుంది. మరైతే, దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో క్లియర్ గా తెలుస్తుంది.
వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa