కాసేపటి క్రితమే బలగం ట్రైలర్ విడుదలయ్యింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బలగం ట్రైలర్ ని లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు. జబర్దస్త్ ఆర్టిస్ట్ వేణు టిల్లు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ యొక్క ట్రైలర్ ఎలా ఉందంటే..
పచ్చని పంట పైరు, స్వచ్ఛమైన మనసు గల పల్లెటూరి వాతావరణంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం అంతే ఫ్రెష్ గా సాగింది. కుటుంబం, ప్రేమ కలిసినప్పుడు కుటుంబమే అన్నిటికంటే పెద్ద బలగం ... అనే నేపథ్యంతో వచ్చిన ఈ ట్రైలర్ సింపుల్ అండ్ స్వీట్ గా ఉంది. ఇక, పూర్తి సినిమా కోసం అంతా వెయిటింగ్.
ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 3న అంటే ఈ శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.