వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, తనలోని విలక్షణతను ప్రతి సినిమాకు మెరుగు పరుచుకుంటూ తెలుగు ప్రేక్షక హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కాదు కానీ, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రేక్షకులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే, ఆయన పుట్టింది 29, ఫిబ్రవరి మరి.
బాణం సినిమాతో సినీ కెరీర్ ని ప్రారంభించిన శ్రీ విష్ణు ముందుగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. 2013లో విడుదలైన "ప్రేమ ఇష్క్ కాదల్"తో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆపై సెకండ్ హ్యాండ్, అప్పట్లో ఒకడుండేవాడు, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర వంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు.
ఈ ఏడాది ఆయన నుండి రాబోతున్న సరికొత్త ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "సామజవరగమన". ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కాబోతుంది.
![]() |
![]() |