మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా ఇటీవలే షూటింగ్ మొదలెట్టిన PKSDT లో నటించే నటీనటులపై తాజాగా క్లారిటీ వస్తుంది. నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇంకెవరు నటీనటులు నటిస్తున్నారో తెలుస్తుకోవాలని ప్రేక్షకాభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ లతో పాటుగా కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చేంబోలు నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఎక్జయిటింగ్ అప్డేట్స్ కోసమైతే అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa