ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూతద్దం భాస్కర్ నారాయణ : ఫస్ట్ సింగిల్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 04:19 PM

శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా దర్శకుడు పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ మిస్టరీ యాక్షన్ డ్రామా "భూతద్దం భాస్కర్ నారాయణ". తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'డప్పుకొట్టి చెప్పుకోనా...ఊరంతా' అనే బ్యూటిఫుల్ లవ్ డ్యూయెట్ సాంగ్ విడుదలయ్యింది. విజయ్ బుల్గనిన్ స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు.


ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ తో పాటుగా శ్రీచరణ్ పాకాల కూడా సంగీతం అందిస్తున్నారు. షఫీ, వర్షిణి, అరుణ్ కుమార్, శివ కుమార్, శివన్నారాయణ, కల్పలత, రూప లక్ష్మి, అంబటి శ్రీని తదితరులు కీరోల్స్ లో నటిస్తున్నారు. మార్చి 31వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa