ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియురాలిపై చేయి చేసుకున్న యువకుడు...సారీ చెప్పు అంటూ నిలదీసిన నాగశౌర్య

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 08:47 PM

హీరో నాగశౌర్యకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డుపై ఓ యువకుడు తన ప్రియురాలిపై చేయి చేసుకోగా, అటుగా వెళ్తున్న నాగ శౌర్య తన కారు దిగి యువకుడిని అడ్డుకున్నాడు. నా లవర్ ను నేను కొడతాను అని ఆ యువకుడు వాదించాడు. అయితే ఆ అమ్మాయిని నడిరోడ్డుపై ఎందుకు కొట్టావు... సారీ చెప్పు అంటూ నాగశౌర్య ఆ యువకుడి చేయిపట్టుకుని నిలదీశాడు. అక్కడున్న వారు కూడా నాగశౌర్యకు మద్దతుగా యువకుడిపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa