ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన ఐశ్వర్య రాజేష్ కొత్త చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2023, 08:47 PM

కోలీవుడ్ బ్యూటీ క్వీన్ ఐశ్వర్య రాజేష్ మరియు RJ బాలాజీ నటించిన 'రన్ బేబీ రన్' మూవీ ఫిబ్రవరి 3, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జియెన్ కృష్ణకుమార్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమైంది. తాజాగా ఇప్పుడు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని మార్చి 10, 2023న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో ఇషా తల్వార్, రాధిక శరత్ కుమార్, స్మృతి వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత అందించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa