సుధీర్ బాబు న్యూ మూవీ "మామా మశ్చీంద్ర" నుండి కాసేపటి క్రితమే న్యూ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్న మెకోవర్స్ లో కనిపిస్తున్నట్టు నిన్నే ప్రకటించిన మేకర్స్ ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే రివీల్ చేసారు. 'దుర్గ' అనే బరువైన పాత్రలో మీ దిల్ దోచేయడానికి వస్తున్నాడు అంటూ ఓవర్ వెయిట్ గా కనిపిస్తున్న సుధీర్ బాబు ని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎప్పుడూ ఫిట్టుగా, హ్యాండ్సమ్ గా కనిపించే సుధీర్ బాబుని చబ్బీగా చూస్తున్న ఆడియన్స్ ఒకింత షాక్ అవుతున్నారు.
హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.