యంగ్ హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా, దర్శకురాలు బీవీ నందినీరెడ్డి రూపొందిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అన్నీ మంచి శకునములే". స్వప్న సినిమాస్, మిత్రవింద ఫిలిమ్స్ సంయుక్త పతాకాలపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి సీనియర్ నటి గౌతమి పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఇందులో గౌతమి 'మీనాక్షి' అనే మధ్యతరగతి గృహిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా టీజర్ ని మార్చి 4న విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ సర్ప్రైజింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు.