ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెడ్యూల్ ప్రకారం థియేటర్లలోకి రానున్న మణిరత్నం యాక్షన్ డ్రామా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 05:40 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన హై బడ్జెట్ ఎపిక్ యాక్షన్ డ్రామా పొన్నియన్ పార్ట్ 1 సెప్టెంబర్ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత, ఈ సినిమా సీక్వెల్‌ను ఏప్రిల్ 28, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఇటీవల ఈ చిత్రం చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చు అని చాలా రూమర్స్ వచ్చాయి.

తాజాగా ఇప్పుడు, ఈ రూమర్స్ పై  చిత్ర బృందం స్పందిస్తూ PS 2 షెడ్యూల్ ప్రకారం అంటే ఏప్రిల్ 28, 2023న థియేటర్‌లలోకి వస్తుంది అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా యొక్క మొత్తం స్టార్ తారాగణం యొక్క చిన్న వీడియో గ్లింప్సె ని కూడా విడుదల చేశారు.


ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష  ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్-ఇండియన్ మూవీ కి ఆస్కార్-విజేత సంగీత దర్శకుడు AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa