ఓ బేబీ ఫేమ్ నందిని రెడ్డి తో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అన్నీ మంచి శకునములే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో సంతోష్ శోభన్‌కి లేడీ లవ్ గా మాళవిక నాయర్ నటించారు.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ లాంచ్ తేదీని ప్రకటించేందుకు ఈరోజు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టీజర్ మార్చి 4న విడుదల కానుంది. వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా మరియు మిత్రవింద మూవీస్ బ్యానర్‌లపై నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa