ఫస్ట్ లుక్ పోస్టర్, లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న రావణాసుర మూవీపై ప్రస్తుతానికైతే ఆడియన్స్ లో చాలా మంచి అంచనాలున్నాయి. మరి, ఈ అంచనాలను మరింత పెంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ టీజర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు మార్చి 6 ఉదయం 10:08 నిమిషాలకు రావణాసుర టీజర్ ఆడియన్స్ ని పలకరించబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు. అభిషేక్ నామ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa