మెగా డాటర్ ఇన్ లా ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ సమయంలో వృత్తి జీవితానికి ఎలాంటి విరామం ఇవ్వకుండా ఇంటా బయటా పనులు చక్కబెడుతూ ప్రెగ్నన్సీని ఎంజాయ్ చేస్తుంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఉపాసన ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో కొన్ని పిక్స్ ని షేర్ చేసింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కి సంబంధించిన లేటెస్ట్ క్లిక్స్ కావడంతో ఇవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. RRR ఆస్కార్ ప్రమోషన్స్ నిమిత్తం ప్రస్తుతం USA లో చరణ్ అక్కడ పలురకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్కో ఈవెంట్ కి అదిరిపోయే లుక్ లో హాజరవుతూ, అభిమానులను అలరిస్తున్నారు.