మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప ది రూల్' ఒకటి. 2021లో విడుదలై ఘనవిజయం సాధించిన 'పుష్ప ది రైజ్' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క చిత్రీకరణ రీసెంట్గానే మొదలయ్యింది.
తాజా సమాచారం ప్రకారం, అభిమానులు తీవ్రంగా కోరుకుంటున్న స్పెషల్ గ్లిమ్స్ ఐతే బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. మరైతే, ఈ వార్తతో బన్నీ అభిమానుల్లో ఫుల్ ఖుషి నెలకొంది.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.