కోలీవుడ్ , టాలీవుడ్ సినీపరిశ్రమలో 80ల కాలంలో స్టార్ హీరోయిన్ గా సూపర్ బిజీగా ఉండేవారు నటి జీవిత. 1991లో హీరో రాజశేఖర్ ని వివాహం చేసుకున్న తదుపరి సినిమాలకు గుడ్ బై చెప్పేసి, ఇక, పూర్తిగా కుటుంబానికే పరిమితమయ్యారు. ఆమె చివరిసారిగా స్క్రీన్ పై కనిపించిన సినిమా మగాడు (1990). నటనకు దూరమైనా జీవిత మాత్రం సినీరంగానికి దూరంగా లేదు. ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సినీరంగానికి సేవ చేస్తూనే ఉన్నారు. శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి... ఇంకా పలు సినిమాలకు ఆమె డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరించారు.
ఐతే, తాజాగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్రేజీ న్యూస్ ప్రకారం, సూపర్ స్టార్ రజినీకాంత్ అప్ కమింగ్ మూవీ 'లాల్ సలాం' తో జీవిత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చెయ్యబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఐతే, ఈ సినిమాలో రజినీకి జీవిత చెల్లెలిగా నటించబోతుందని, ఈ నెల 7నుండి చెన్నైలో షూటింగ్ మొదలు కాబోతుందని అంటున్నారు.
ఈ సినిమాకు రజిని పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనుంది. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ లో నటించబోతున్నారు. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.