టాలీవుడ్ లో అందమైన మరియు ముచ్చటైన జంటల్లో శివ బాలాజీ, మధుమితల జంట ఒకటి. 2009లో శివబాలాజిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మధుమిత ఆపై సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యనే కొన్ని సినిమాలలో నటించడం ప్రారంభించింది.
ఐతే, వివాహం జరిగి పద్నాలుగేళ్లు నిండిన సందర్భంగా ప్రియుడు, భర్త శివబాలాజీకి మధుమిత ఎంతో అందమైన కవిత రూపంలో వివాహవార్షిక శుభాకాంక్షలను తెలియచేసింది. నా జననం నేను ఎంచుకోనిది ..నా మరణం ఎంచుకోలేనిది .. ఎనలేని ప్రేమతో నేను ఎంచుకున్న మీతో నా జీవితాన్ని అమితమైన ప్రేమతో అత్యద్భుతంగా మలిచారు. ఈ అనంత విశ్వం నాకు ఇచ్చిన అతి గొప్ప వరం మీరు .. మీరు నా శివ నేను మీ మధు.. సదా ప్రేమలో పద్నాలుగేళ్ల శివమధు ..పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ మధుమిత ఎంతో ఎమోషన్ తో కూడిన పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది చదివిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ప్రేమకు ఆనందిస్తున్నారు.