పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల గతేడాది రవితేజ సరసన ధమాకాలో నటించి, ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఈ యంగ్ సెన్సేషన్ కి ఆఫర్లు వెల్లివిరిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీల నితిన్ 32, రామ్ - బోయపాటి, NBK 108, SSMB 28 సినిమాలలో నటిస్తుండగా, తాజాగా ఒక క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో లీడ్ హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రచారం మొదలయ్యింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కలయికలో రీసెంట్గానే ఒక పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్మెంట్ జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందంటూ వినికిడి. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.