సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే మంచు లక్ష్మి తాజాగా ఈ రోజు ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తమ్ముడు మంచు మనోజ్ ఫోటోని పోస్ట్ చేసి అన్ని దిష్టి కళ్ళు గుడ్డివైపోవాలి..తధాస్తు అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లలో ఈ పోస్ట్ కి అర్థం తెలుసుకోవాలని కుతూహలం పెరిగిపోతుంది.
మరి, అందుతున్న సమాచారం ప్రకారం, మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయని తెలుస్తుంది. మంచు మనోజ్ మార్చి 3వ తేదీన పెళ్లి పీటలెక్కబోతున్నాడని, ఈ మేరకు ఈ రోజు మెహందీ వేడుక జరుగుతుందని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మంచు మనోజ్ కి అడ్వాన్స్ విషెస్ తెలియచేస్తున్నారు.