యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "మీటర్". రీసెంట్గానే 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ ఆ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
రమేష్ కదురి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు మీటర్ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, సరిగ్గా అదే రోజు మాస్ రాజా రవితేజ నటించిన 'రావణాసుర' మూవీ కూడా విడుదల కాబోతుంది.
మరి, మీటర్ తో రావణాసురుడికి ఎదురెళ్తున్న యంగ్ హీరో తన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తాడా..? తెలుసుకోవాలంటే, వెయిట్ అండ్ సి..!!