ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని ఖరారు చేసిన నివిన్ పౌలీ పీరియడ్ డ్రామా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 09:07 PM

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ చివరిసారిగా మహావీర్యార్ చిత్రంలో కనిపించాడు. తాజాగా ఇప్పుడు చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతున్న పీరియడ్ డ్రామా 'తురముఖం' చివరకు కొత్త విడుదల తేదీని పొందింది. ఈ సినిమా విడుదల ఇప్పటికి 4 సార్లు వాయిదా పడింది.


తాజా అప్‌డేట్‌ ప్రకారం, రాజీవ్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 10, 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. గోపన్ చిదంబరన్ రచించిన ఈ పీరియాడికల్ డ్రామాలో జోజు జార్జ్, దర్శనా రాజేంద్రన్, సెదేవ్ నాయర్, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. తెక్కెపట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్, కలెక్టివ్ ఫేజ్ వన్ మరియు క్వీన్ మేరీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com