కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా నిన్న విడుదల కావాల్సిన విరూపాక్ష మూవీ టీజర్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా విరూపాక్ష టీజర్ ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
టైటిల్ గ్లిమ్స్ వీడియోతో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన ఈ మూవీ యొక్క టీజర్ పై ఆడియన్స్ లో చాలా మంచి అంచనాలున్నాయి. మరి, టీజర్ ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుందో తెలియాలంటే, సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది.