ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' తో ఇరు తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ సెన్సేషన్ సృష్టించిన సినిమా "ఓ బేబీ". విజయ్ బుల్గనిన్ స్వరకల్పనలో సింగర్ శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాట గతేడాది విడుదలై, శ్రోతలను మైమరిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అలానే ఆడియో ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఓ బేబీ సెకండ్ సింగిల్ కోసం మేకర్స్ మలయాళం సింగింగ్ సెన్సేషన్ ఆర్య దయాళ్ ని ఎంచుకున్నారని తెలుస్తుంది. ఈ మేరకు ఆమె నిన్న హైదరాబాద్ లో ప్రమోషనల్ షూట్ లో కూడా పాల్గొన్నారు. మరి అతి త్వరలోనే సెకండ్ సింగిల్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ మేకర్స్ నుండి వచ్చే అవకాశం కనిపిస్తుంది.