కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ నెగటివ్ రోల్ పోషిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాజాగా ఇప్పుడు, ఒక అభిమాని వెన్నెల కిషోర్‌ని పాన్ ఇండియన్ మూవీలో భాగమా అని అడిగినప్పుడు...... వెన్నెల కిషోర్ ఈ పుకార్లను కొట్టిపారేస్తూ తన స్టైల్‌లో చమత్కారమైన సమాధానం ఇచ్చారు. ఇండియన్ 2 లో లేను పాకిస్తాన్ 3 లో లేను అని రాసి నటుడు ఫన్నీ జిఫ్ ని జోడించారు.
ఈ పాన్-ఇండియన్ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.
![]() |
![]() |