శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వంలో అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట మరియు నవ్య స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'బుట్టా బొమ్మ' సినిమా ఫిబ్రవరి 4, 2023న గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 4న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది అని OTT ప్లాట్‌ఫారమ్ అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళ చిత్రం కప్పెల యొక్క రీమేక్. జగదీష్ ప్రతాప్ బండారి, రాజ్ తిరందాసు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.