బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సంక్రాంతి విజేత గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
తాజాగా ఇప్పుడు చిత్ర దర్శకుడు బాబీ తన కుమార్తె మరియు భార్యతో కలిసి ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలో వాల్తేర్ వీరయ్య సినిమాని చూసినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa