శాండల్ వుడ్ నుండి రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ యాంటిసిపేటెడ్ మూవీ "కబ్జా". ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధానపాత్రల్లో నటిస్తుండగా, శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తుంది.
ఐతే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కారునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ రోజు ఈ బిగ్ సర్ప్రైజ్ ని రివీల్ చేసారు.
R. చంద్రు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa