టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో అధికారికంగా ప్రారంభించబడింది.
ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో రెండో మహిళా ప్రధాన పాత్రకి బాలీవుడ్ యువ నటి సాయి మంజ్రేకర్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.