ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనిక రెడ్డిలు భారీ కాన్వయ్ తో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి కర్నూల్ బయలుదేరారు. ప్రొద్దుటూరులో రామ సుబ్బారెడ్డి ని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు.అనంతరం ఆళ్లగడ్డ లోని భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. మనోజ్, మౌనిక రెడ్డిలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో మొదటిసారి వివాహమైంది. వీరిద్దరూ 2019లో పరస్పర అంగీకారంతో విడిపోయారు.
మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి విడాకులు అయ్యాయి. మరోవైపు మనోజ్ కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల 'వాట్ ది ఫిష్' చిత్రాన్ని ప్రకటించారు.