సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కుమారుడు, ఎ.ఆర్. అమీన్ మూడు రోజుల క్రితం ఒక ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మ్యూజిక్ ప్లే అవుతున్న సెట్‌లో ప్రమాదం జరిగిందని అమీన్ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకున్నారు.తాను ప్రదర్శన చేస్తున్నప్పుడు షాన్డిలియర్లు, లైట్లు, ఇతర వస్తువులు పైనుంచి పడిపోయాయని ఆ పోస్ట్‌లో అమీన్ పేర్కొన్నాడు. తాను క్షేమంగా ఉన్నాననీ తెలిపాడు.