ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ : శర్వానంద్ 35వ సినిమా అధికారిక ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 09:33 AM

ఈ రోజు హీరో శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కమింగ్ ఆఫ్ ఏజ్ తరహా కథతో రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. విశేషమేంటంటే, ఈ ప్రాజెక్ట్ యొక్క అధికారిక ప్రకటన ఇప్పుడు జరిగినా, షూటింగ్ మాత్రం ఎప్పుడో మొదలై, ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. DOP - విష్ణుశర్మ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి. 


దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గతంలో భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్, హీరో చిత్రాలను రూపొందించారు. పోతే, ఈ సినిమా శర్వానంద్ కి 35వ సినిమా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa