లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు సంపాదించుకున్న "అహింస" మూవీని ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లకు తీసుకురాబోతున్నట్టుగా తెలుపుతూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.
దగ్గుబాటి అభిరాం హీరోగా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. అలానే హీరోయిన్ గీతికా తివారి మొదటి చిత్రం కూడా ఇదే. విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు తేజ ఈ సినిమాను తన మార్క్ యాక్షన్, ప్రేమ, బలమైన ఎమోషన్స్ మరియు రస్టిక్ క్యారెక్టర్ల సమ్మేళనంగా రూపొందించారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |