తనకు 8 ఏళ్ల వయసున్నపుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించడం ప్రారంభించాడని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ 'ఒక చిన్నారి వేధింపులకు గురైనప్పుడు, అది ఆ చిన్నారికి జీవితాంతం మచ్చగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నాకు 15 ఏళ్ల వయస్సులో మా నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు అతను మమ్మల్ని వదిలిపెట్టాడు' అని ఖుష్బు చెప్పారు.