బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణె, జాన్ అబ్రహం నటించిన సూపర్ హిట్ మూవీ పఠాన్. ఈ సినిమా రూ.1,000 కోట్ల కలెక్షన్లు దాటి దూసుకుపోతోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. మూవీ ఓటీటీ రైట్స్ ని భారీ ధరకి దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దీనిని ఏప్రిల్ ఆఖరి వారంలో రిలీజ్ చేయనుందట. అయితే దీనిపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.