ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్ తో శ్రోతలను మైమరిపిస్తున్న రంగమార్తాండ చిత్రం నుండి ఈ రోజు మరొక కొత్త సాంగ్ విడుదలయ్యింది. నాటకరంగం వేరు.. జీవిత రంగం వేరు.. అంటూ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా రూపొందించి, ఆలపించిన ఈ పాటకు సాహిత్య బ్రహ్మ స్వర్గీయ శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు కాగా, కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణన్, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన తారాగణం.