ఈ రోజు ఉదయం విడుదలైన రావణాసుర మూవీ టీజర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపట్లోనే వన్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. రవితేజ నెవర్ బిఫోర్ విలనిజం, యాక్టింగ్ తో టీజర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తుంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ కీరోల్స్ లో నటిస్తున్నారు. వచ్చే నెల 7న విడుదల కాబోతుంది.