ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో సరికొత్త పోస్ట్ ను షేర్ చేసి వార్తల్లో నిలిచారు. హ్యాపీ యానివర్సరీ క్యూటీ..అంటూ భార్య స్నేహా రెడ్డికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలుపుతూ, వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పిక్ ను షేర్ చేసారు. అల్లు అభిమానులు ఈ పిక్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
మార్చి 6 2011లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరువురికి ఇద్దరు సంతానం అల్లు అయాన్, అల్లు అర్హ.