కృష్ణవంశీ దర్శకత్వంలో 21వ సినిమాగా రూపొందుతున్న "రంగమార్తాండ" నుండి ఇప్పటివరకు విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. తాజాగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నీకూ తెలిసే సత్యం..., ఆరు గంటలకు ముగిసిందా నీ అజ్ఞాతవాసం ... లిరికల్ వీడియోలను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఓకే పోస్టర్ తో ఎనౌన్స్ చేసారు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయా భరద్వాజ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.