ఎప్పటి నుండో ఊహాగానాలు, సోషల్ మీడియా జోరు ప్రచారాల తదుపరి ఇప్పటికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ 30 హీరోయిన్ పై ప్రేక్షకాభిమానులకు సాలిడ్ క్లారిటీ వస్తుంది. జరిగిన ప్రచారం మేరకు, అందరూ కావాలని కోరుకుంటున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూరే ఎన్టీఆర్ 30 లో తారక్ కి జోడిగా నటిస్తుందని ధృవీకరిస్తూ మేకర్స్ ఈ రోజు అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ రోజు జాన్వీ బర్త్ డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30 మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి, ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఇంకా మొదలు కావలసి ఉంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు.