శ్రీ తేజస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పెట్ల కృష్ణమూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, PNK శ్రీలత నిర్మిస్తున్న చిత్రం "కృష్ణగాడు అంటే ఒక రేంజ్". కొత్త దర్శకుడు రాజేష్ దొండపాటి దర్శకత్వంలో నూతన హీరో హీరోయిన్లు రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లిమ్స్ ఈ రోజు విడుదలయ్యింది. ఈ గ్లిమ్స్ వీడియో క్యూట్ గా, ఫన్నీ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తానికి గ్లిమ్స్ ఐతే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.