కొంతసేపటి క్రితమే మీటర్ టీజర్ విడుదలయ్యింది. ఇప్పటివరకు హీరో కిరణ్ అబ్బవరం కనిపించని ఫుల్ ఆన్ మాస్ యాంగిల్ ని ఈ సినిమాలో మనం చూడవచ్చు. లవ్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ టీజర్ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలియచేస్తుంది.
రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , అతుల్య రవి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సప్తగిరి, పోసాని కృష్ణ మురళి కీరోల్స్ లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త బ్యానర్లపై చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa