ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతార్ 2 పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 02:39 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన గ్రాండ్ విజువల్ వండర్ "అవతార్ 2". ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం, 2 బిలియన్ మార్క్ ను క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా చరిత్రకెక్కింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో అవతార్ 2 టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా రన్ అవుతుందంటే, ఆడియన్స్ లో ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్ధం అవుతుంది.


తాజాగా అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం, ఇప్పుడు అవతార్ 2 ను మనం మన మొబైల్ స్క్రీన్స్లో ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు చూసుకోవచ్చని తెలుస్తుంది. అంటే, అవతార్ 2 డిజిటల్ ఎంట్రీ కి రెడీ అయ్యింది. ఈ నెల 28 నుండి డిజిటల్ స్క్రీన్స్ పై అవతార్ 2 ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. కొన్ని రోజులు రెంటల్ బేసిస్ లో ఆపై అందరికీ అందుబాటులోకి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa