ఎనర్జిటిక్ స్టార్ రామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన సినిమా విశేషాలని రామ్ అభిమానులకు తెలియజేస్తుంటాడు. సినిమాల్లో రామ్ కనబరిచే ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు రామ్. కానీ ఆ జోరు ఇప్పుడు తగ్గింది. రామ్ కు తరచుగా పరాజయాలు ఎదురవుతున్నాయి. నేను శైలజ చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అనుకున్న తరుణంలో మరోసారి రామ్ చిత్రాలు నిరాశ పరిచాయి. ఇదిలా ఉండగా రామ్ తాజాగా ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ రామ్ చేసిన ఆ ట్వీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
కొనేళ్ల క్రితం ప్రతిష్టాత్మక కియా మోటార్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో తన కార్యకలాపాల్ని ప్రారంభించి.. కారుల ఉత్పత్తిని ప్రారంభించింది. ఇటీవల కియా మోటార్స్ తయారు చేసిన తొలి దశ కార్లు రెడీ అయ్యాయి. కియా కారు లాంచ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దీనిని హీరో రామ్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఏపీ అభివృద్ధిలో ఇది కీలక అడుగు. ఇలాంటివి మరిన్ని రాబోతున్నాయి అంటూ రామ్ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ పై నెటిజన్లు విభిన్న స్పందన తెలియజేశారు. అభివృద్ధికి అండగా నిలిచిన హీరో అని కొందరు ప్రశంసించగా.. మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నావు అంటూ కామెంట్ చేశారు. దీనిపై రామ్ తనదైన శైలిలో స్పందిస్తూ మరో ట్వీట్ చేశాడు. తనని విమర్శిస్తున్న వారికి సరైన సమాధానం ఇచ్చాడు.
నా ఇల్లు సక్కబెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్.. నువ్వు చెయ్ నీకూ వేస్తా ఓ ట్వీటు.. ఆంధ్రా నాదే.. తెలంగాణ నాదే.. ఇదే మాటమీద ఉంటా. ఇక్కడ కులం లేదు.. ప్రాంతం లేదు.. డిస్కషన్ అసలే లేదు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలతో రామ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం తెరకెక్కుతోంది. పూరి జగన్నాథ్ సొంత నిర్మాణంలో ఈ చిత్రం తెరక్కుతుండడం విశేషం. రామ్ ఈ చిత్రంలో రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
“Naa illu sakkapettetodu yevaraithe naakenti annai..nuvvu chey..neeku esta o tweetu .. Andhra naadhe..Telangana naadhe..idhey maata medhunta! Ikkada Kulam led..Prantham led..Discussion assal led!“ #Love - R.A.P.O #CitizenFirstActorNext
— RAm POthineni (@ramsayz) January 29, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa