సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ థ్రిల్లర్ డ్రామాలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 25 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం.
హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రానా మరియు ఇతరులు ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి విశాల్ మరియు షేకర్ సంగీతం అందించారు.