అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వంలో యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'లాస్ట్' అనే సినిమా ఫిబ్రవరి 16 నుండి ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. చికాగో సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (CSAFF) మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) లలో ప్రత్యేక ప్రదర్శనలు పొందిన ఈ చిత్రం ఇప్పుడు మరో మరపురాని ఫీట్ సాధించింది.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో 250 మిలియన్ల వాచ్ నిమిషాలను క్లాక్ చేసింది. శంతను మోయిత్రా ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌లను అందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, కిషోర్ అరోరా, షరీన్ మంత్రి, సామ్ ఫెర్నాండెజ్ మరియు ఇంద్రాణి ముఖర్జీ నిర్మించారు.