టీజర్ తో సెన్సేషన్ సృష్టించి, లిరికల్ సాంగ్స్ తో ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ సంపాదిస్తున్న చిత్రం "దసరా". శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో మార్చి 30న విడుదల కావడానికి ముస్తాబవుతున్న ఈ సినిమా నుండి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు డేట్ ని ఫిక్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ లో దగ్ధమవుతున్న పది తలల రావణాసురుని ఎదురు రెండు గొడ్డళ్లను కలిపి పట్టుకుని నిల్చున్న నాని మనకు కనిపిస్తారు. పోతే, మార్చి 14న దసరా ట్రైలర్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.
![]() |
![]() |