'ఆర్ఎక్స్ 100' ఫేం పాయల్ రాజ్‌పుత్ కొత్త ప్రాజెక్ట్ ఏంటి? ప్రస్తుతం తమిళ్, పంజాబీ సినిమాలతో బిజీగావున్న ఈ బ్యూటీ.. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తెలుగులో రవితేజ పక్కన నటించే అవకాశం ఛాన్స్ అందుకున్న పాయల్, ఓ ఫిల్మ్‌లో స్పెషల్ సాంగ్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
తేజ డైరెక్షన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్- కాజల్ జంటగా 'సీత' అనే సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు టాక్. త్వరలో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నఈ చిత్రం మార్చిలో విడుదలయ్యే ఛాన్స్ వుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa