గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "శాకుంతలం". పాన్ ఇండియా భాషల్లో ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమాపై ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు అందుతుంది. అదేంటంటే, శాకుంతలం ఫైనల్ కాపీ చూసిన సమంత తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ మేరకు ఒక ఎమోషనల్ నోట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈరోజే ఫైనల్ కాపీ చూసాను.. నా హృదయంలో గుణశేఖర్ గారు ఉన్నారు. ఎంత అందంగా ఉంది ఈ చిత్రం. భారతదేశ పురాణేతిహాసాలలో ఒకటి ఎంతో అద్భుతంగా జీవం పోసుకుంది. ఈ సినిమాలోని పవర్ఫుల్ ఎమోషన్స్ ని ఆడియన్స్ కూడా ఎక్స్పీరిఎన్స్ చేసేందుకు నాకు చాలా తొందరగా ఉంది..అంటూ సమంత పోస్ట్ లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa