'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ తో ఆడియన్స్ లో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చైతన్య రావు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అన్నపూర్ణ ఫోటో స్టూడియో". ఈ సినిమా ఒక అందమైన విలేజ్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. చందు ముద్దు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇందులో లావణ్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 09: 09 నిమిషాలకు ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa