కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి ఆఖరి చిత్రం "గంధద గుడి". అవార్డు విన్నింగ్ వైల్డ్ లైఫ్ ఫిలిం మేకర్ అమోఘవర్ష JS ఈ సినిమాకు దర్శకుడు. అలానే ఈ సినిమాలో లీడ్ రోల్ లో పునీత్ రాజ్ కుమార్ గారితో కలిసి నటించారు. కర్ణాటక రాష్ట్ర బయో డైవర్సిటీని కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో మనం చూడవచ్చు.
పునీత్ రాజ్ కుమార్ గారి మరణం తదుపరి ఏడాదికి ఈ సినిమా విడుదలై, సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో గంధడ గుడి డిజిటల్ ప్రీమియర్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa